హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు (Justice Bhaskara Rao) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఉమ్మడి హైకోర్టు (High Court) విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. భాస్కరరావు 86 ఏళ్ల వయసులో సోమవారంనాడు కన్నుమూశారు. భాస్కరరావు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda District) చింతపల్లి మండలం ఘడియా గౌరారం.
1937లో జన్మించిన భాస్కరరావు ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో బీఎస్సీ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1963లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. 1981లో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1997లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1999లో పదవీవిరమణ పొందారు. జస్టిస్ భాస్కరరావుకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ప్రస్తుతం కమిటీ ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.