»Hyderabad Two Groups Clash Over Property Dispute In Old City Lawyer Opens Fire
Hyderabad:ఆస్తి కోసం ఘర్షణకు దిగిన రెండు కుటుంబాలు.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు
అరాఫత్, లాయర్ మహ్మద్ అలీ కుటుంబాల మధ్య రాత్రి ఘర్షణ జరిగింది. అర్ఫత్ మీర్ చౌక్ ప్రాంతంలోనే ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత అర్ఫత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అతడి పొరుగింటి మహ్మద్ అలీ అడ్డుకున్నాడు.
Hyderabad:హైదరాబాద్‌లో ఆస్తి వివాదంపై అర్థరాత్రి రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు కూడా జరగడంతో పాటు రాళ్లు రువ్వుకున్నారు. అదే సమయంలో కర్రలతో దాడు చేసుకున్నారు. మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరా, మొబైల్ ఫోన్లో రికార్డైంది. విజువల్స్‌లో, కర్రలు పట్టుకున్న మహిళలు, ఇరు కుటుంబాల సభ్యులు ఒకరితో ఒకరు వాదించుకోవడం కనిపిస్తుంది. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు.
అర్ఫత్, లాయర్ మహ్మద్ అలీ కుటుంబాల మధ్య రాత్రి గొడవ జరిగినట్లు సమాచారం. అర్ఫత్ మీర్ చౌక్ ప్రాంతంలోనే ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత అర్ఫత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అతడి పొరుగింటి మహ్మద్ అలీ అడ్డుకున్నాడు. ఈ ఆస్తిపై వివాదం ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని అలీ తెలిపారు. అయితే, ఆస్తి వివాదానికి సంబంధించి అర్ఫత్ గత వారం లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిన్న రాత్రి అతను ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, మహమ్మద్ అలీ, అతని కుటుంబ సభ్యులు అతన్ని మళ్లీ అడ్డుకున్నారు. కొద్ది సేపటికే ఈ వివాదం తీవ్ర స్థాయిలో మారింది. న్యాయవాది కోపంతో రగిలిపోతూ కనిపించాడు. ఆ తర్వాత అతను గాలిలోకి కాల్పులు జరిపాడు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. విషయం పోలీసుల వరకు చేరింది.
Row over property resulted in a clash among two groups in #old city of Hyderabad, a lawyer reportedly opened fire with his licensed rifle. @TheSiasatDaily pic.twitter.com/n3gKMiSI5c
ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలు
పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనలో ఒకటి రెండు కార్లు దెబ్బతిన్నాయి. దాదాపు 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఆస్తికి సంబంధించి వివాదం ఉందని, అరాఫత్ అనే వ్యక్తి ఇటీవల ఆస్తిలో కొంత భాగాన్ని కొనుగోలు చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.