America Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తెరపైకి వచ్చింది. ఇక్కడి డౌన్ టౌన్ సెయింట్ లూయిస్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఓ భవనంలో పార్టీ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగినట్లు సమాచారం. మేయర్ తిషౌరా జోన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల్లో 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
CNN ప్రకారం, ఈ సంఘటనలో 17 ఏళ్ల అనుమానితుడు కస్టడీలో ఉన్నట్లు పోలీసు చీఫ్ రాబర్ట్ ట్రేసీ ఆదివారం తెలిపారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా సెయింట్ లూయిస్ ప్రాంతంలోని కుటుంబాలు మరో సామూహిక కాల్పుల వార్తతో షాక్ కు గురయ్యాయని జోన్స్ చెప్పారు. గాయపడిన బాధితులు 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే. ఓ మహిళ అక్కడి నుంచి పారిపోతుండగా కాల్పుల్లో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
Teenager killed, 9 injured in mass shooting in US’ St Louis
క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. గాయపడిన వారిలో పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన 9 మంది వ్యక్తులను నాలుగు దవాఖానలకు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆగంతకులు ఎందుకు కాల్పులు జరిపారన్న సంగతి తెలియరాలేదు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తున్నది. వేడుక జరిగిన విల్లో బ్రూక్ పార్కింగ్ ఏరియా వద్ద దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.