»Texas Gun Fire 9 Killed After Gunman Opens Fire At Dallas Mall
Allen Mall మళ్లీ కాల్పుల మోత.. అమెరికాలో తుపాకీ తూటాకు 9 మంది బలి
మాల్ బయట ఓ దుండగుడు కారు నిలిపాడు. అనంతరం బయటకు వచ్చి కారు దిగుతూనే తుపాకీ పేలుస్తూ మాల్ లోకి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ కోసం మాల్ కు వచ్చిన వారు మృతి చెందారు.
తుపాకీ సంస్కృతి (Gun Culture) అమెరికాను వణికిస్తోంది. రోజుకు ఎక్కడో ఒక చోట తుపాకీ (Gun Fire) తూటాలు పేలుతున్నాయి. ఎప్పుడు ఎక్కడా తుపాకీ శబ్ధం వినిపిస్తోందనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమయంలోనే మరొక ఘోర సంఘటన చోటుచేసుకుంది. తాజాగా జరిగిన కాల్పుల్లో (Fire) ఏకంగా 8 మంది చనిపోయారు. ఈ సంఘటన టెక్సాస్ (Texas) రాష్ట్రం డల్లాస్ (Dallas) నగర శివారులో చోటుచేసుకుంది.
డల్లాస్ శివారు ప్రాంతం అలెన్ (Allen)లోని ప్రీమియర్ మాల్ (Premium Outlet Mall)లో శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో మాల్ బయట ఓ దుండగుడు కారు నిలిపాడు. అనంతరం బయటకు వచ్చి కారు దిగుతూనే తుపాకీ పేలుస్తూ మాల్ లోకి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ (Shopping) కోసం మాల్ కు వచ్చిన వారు మృతి చెందారు. అతడి కాల్పుల్లో 8 మంది చనిపోయారు. మృతుల్లో 5 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయసు వాళ్లు కూడా ఉన్నారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే మాల్ కు చేరుకున్నారు. షాపింగ్ కు వచ్చిన ప్రజలను సురక్షితంగా బయటకు తరలించారు. మాల్ ను మొత్తం చుట్టుముట్టి నిందితుడిని మట్టుబెట్టారు. పోలీసులు కాల్పులు జరపడంతో దుండగుడు మృతి చెందాడు. ఈ సంఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్ గవర్నర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.