»Telangana Ap Software Engineer Died In Cricket Stadium With Heart Attack
Heartstroke క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ కాసేపటికే
బ్యాటింగ్ చేసిన అనంతరం ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. అనంతరం వెన్నునొప్పి అంటూ మధ్యలోనే వెళ్లిపోయి కారులో విశ్రాంతి కోసం వెళ్లాడు. కారులోనే కుప్పకూలిపోయాడు. ఆట అనంతరం స్నేహితులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు.
గుండెపోటు (Heart Attack) మరణాలు కలవరపరుస్తున్నాయి. అధిక వయసు వారే కాకుండా నిండా పదేళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు (Death). తాజాగా మరో యువకుడి గుండి ఆగిపోయింది. క్రికెట్ (Cricket) ఆడుతుండగా అకస్మాత్తుగా గుండెనొప్పికి గురై స్టేడియంలోనే (Stadium) మృతి చెందాడు. ఈ విషాదం సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకోగా.. మృతుడు ఏపీకి చెందినవాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మర్రిపూడి మణికంఠ (26) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer)గా పని చేస్తున్నాడు. గతేడాది హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి సాఫ్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ పొందాడు. అనంతరం కేపీహెచ్ బీ కాలనీలో (KPHB Colony) ఓ హాస్టల్ (Hostel) ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వారాంతాల్లో క్రికెట్ అలవాటు ఉంది. శనివారం రంగారెడ్డి జిల్లా (RangaReddy District) మహేశ్వరం (Maheshwaram) మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ క్రికెట్ స్టేడియానికి (KCR Cricket Stadium) వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మణికంఠ క్రికెట్ ఆడాడు. బ్యాటింగ్ చేసిన అనంతరం ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. అనంతరం వెన్నునొప్పి (Chest Pain) అంటూ మధ్యలోనే వెళ్లిపోయి కారులో విశ్రాంతి కోసం వెళ్లాడు. కారులోనే మణికంఠ కుప్పకూలిపోయాడు. ఆట అనంతరం స్నేహితులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. అయినా కూడా మహేశ్వరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడు మృతి చెందినట్లు చెప్పారు.
ఈ విషయాన్ని మణికంఠ సోదరుడు వెంకటేశ్ కు స్నేహితుడు యశ్వంత్ ఫోన్ (Phone)లో సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి (Osmania Hospital) తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా చేతికొచ్చిన కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో మణికంఠ కుటుంబసభ్యులు (Family) తీవ్ర విషాదంలో మునిగారు.