JN: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకు 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె.కోదండ రాములు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.