»King Charles Coronation Spooked Horse Crashes Into Crowd During Kings Coronation Parade
King Charles Coronation బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో అపశ్రుతి.. గుర్రం హల్ చల్
పట్టాభిషేక మహోత్సవంలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయింది. అటు ఇటు పరుగెడుతూ హల్ చల్ చేసింది. కాగా ఈ సంఘటన పట్టాభిషేకం పూర్తయిన అనంతరం జరగడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
బ్రిటన్ రాజు చార్లెస్ 3 (King Charles 3) పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. రాచరికపు లాంఛనాలతో బ్రిటన్ ప్రభుత్వం (Britain Govt) అధికారికంగా ఈ వేడుకను నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో జరిగిన పట్టాభిషేకం మహోత్సవాన్ని (King Charles Coronation) యావత్ ప్రపంచం వీక్షించింది. కాగా ఈ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. గౌరవ వందనం కోసం ఏర్పాటుచేసిన అశ్వదళంలో (Cavalry) ఓ అశ్వం (Horse) అదుపు తప్పింది. కొంత గందరగోళం సృష్టించింది.
లండన్ (London)లోని వెస్ట్ మినిస్టర్ అబేలో (Westminster Abbey) శనివారం జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ (Uncontrol) కోల్పోయింది. అటు ఇటు పరుగెడుతూ హల్ చల్ చేసింది. కాగా ఈ సంఘటన పట్టాభిషేకం పూర్తయిన అనంతరం జరగడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. యాల్ హౌస్ హోల్డ్ లోని మౌంటెడ్ సభ్యుడిపై గుర్రం దాడి చేసింది. అనంతరం అక్కడే వేడుక కోసం వచ్చిన అతిథులు (Guests), వీక్షకులపై దూసుకెళ్లింది. ఈ పరిణామంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే ఉన్నతాధికారి వచ్చి గుర్రాన్ని నియంత్రించారు. స్వల్ప ఘటనతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడికి హాజరైన వారు కూడా హమ్మయ్య అనుకున్నారు.
During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e
— S p r i n t e r F a m i l y (@SprinterFamily) May 6, 2023