»Mayurbhanj Lights Go Off During President Droupadi Murmus Speech In Odisha
Power off రాష్ట్రపతికి చేదు అనుభవం.. చీకట్లోనే 15 నిమిషాలు ప్రసంగం
ఒక్కసారిగా కలవరం ఏర్పడింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలా ఏకంగా దాదాపు పది నిమిషాల పాటు ఆమె చీకట్లోనే ఉన్నారు. కాగా విద్యుత్ అంతరాయంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
భారతదేశ ప్రథమ పౌరురాలు (President of India). దేశం పాలనంతా ఆమె పేరుపైనే జరుగుతుంది. అలాంటి ఆమె పర్యటన అంటే ఎన్ని ఏర్పాట్లు చేయాలి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది ఏర్పాట్లు (Arrangements) సక్రమంగా చేయకపోవడంతో ఆమె ఏకంగా 9 నిమిషాల చీకట్లో ఉండిపోయారు. ఆ చీకట్లోనే (Lights Off) ప్రసంగం చేయాల్సిన పరిస్థితి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆ పరిస్థితి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi Murmu) ఎదురైంది. అధికారుల నిర్లక్ష్యంతో ముర్ము చీకట్లో మగ్గారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించింది.
ఒడిశాలో (Odisha)ని మయూర్ భంజ్ (Mayurbhanj District) జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా బరిపదలోని రామచంద్ర భంజదేవ్ వర్సిటీ (Maharaja Sriram Chandra Bhanja Deo University) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో 9 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా కలవరం ఏర్పడింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలా ఏకంగా దాదాపు పది నిమిషాల పాటు ఆమె చీకట్లోనే ఉన్నారు. కాగా విద్యుత్ అంతరాయంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘చీకటి వెలుగులను సమానం చూడాలనే విషయాన్ని ఈ సంఘటన నుంచి నేర్చుకోవాలి’ అని పేర్కొనడం గమనార్హం. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జనరేటర్ ను సిద్ధంగా ఉంచాలి. కానీ అది కూడా వినియోగించలేదు.
కాగా ఈ సంఘటనపై ఒడిశాలో తీవ్ర వివాదం ఏర్పడింది. తీవ్ర విమర్శలు రావడంతో ఒడిశా విద్యుత్ శాఖ స్పందించింది. ‘ఆడిటోరియంలో సమస్య వలన విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మా వలన కాదు. ఈ సంఘటనకు మేం బాధ్యులం కాదు’ అని ఒడిశా విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయంపై విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సంతోశ్ త్రిపాఠి క్షమాపణలు తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటనకు అన్నీ ఏర్పాట్లు చేశాం. జనరేటర్ కూడా సిద్ధం చేశాం. కానీ అది పని చేయలేదు’ అని వీసీ తెలిపారు.