అమెరికాలోని (America) టెక్సాస్ (Texas)లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో (Gun Fire) తెలంగాణ అమ్మాయి మృతి చెందింది. డల్లాస్ (Dallas) నగర శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన విద్యార్థి చనిపోయింది. ఉన్నత విద్య (Higher Education) కోసం వెళ్లిన ఆ యువతి తుపాకీ కాల్పుల్లో మరణించడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ లో తీవ్ర విషాదం అలుముకుంది.
డల్లాస్ శివారు ప్రాంతం అలెన్ (Allen)లోని ప్రీమియర్ మాల్ (Premium Outlet Mall)లో శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ (Shopping) కోసం మాల్ కు వచ్చిన వారు 8 మంది చనిపోయారు. వారిలో రంగారెడ్డి జిల్లా కోర్టు (RangaReddy District Court) జడ్జి తాటికొండ నర్సిరెడ్డి, అరుణల కుమార్తె ఐశ్వర్య రెడ్డి (27). సరూర్ నగర్ లో వీరు నివసిస్తుండగా కుమార్తె కొన్నేళ్ల కిందట టెక్సాస్ కు వెళ్లింది. అక్కడ ఉన్నత విద్య చదువుతోంది. మొన్న జరిగిన కాల్పుల్లో ఐశ్వర్యా రెడ్డి కూడా ఉంది. ఆ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది. వెంటనే పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.
ఆమె మృతిని అక్కడి అమెరికా అధికారులు, తెలుగు సంఘాలు (Telugu Associations) కూడా ధ్రువీకరించాయి. అక్కడి ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఐశ్వర్య మృతదేహం (Dead Body) రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకోనుంది. మృతదేహం తరలింపునకు అమెరికాలోని తెలుగు సంఘాలు సహకరిస్తున్నాయి. కాగా తమ కుమార్తె మృతితో సరూర్ నగర్ తీవ్ర విషాదం అలుముకుంది.