»Telangana Brs Party Chief Kcr Welcomed Bhumi Putra Sangathan Party Merge Brs
Maharashtraలో సీఎం కేసీఆర్ కు భారీ మద్దతు.. బీఆర్ఎస్ లో మరో పార్టీ విలీనం
భారత్ రాష్ట్ర సమితికి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ విలీనం కాగా తాజాగా మరో పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది.
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. రెండు వారాలుగా మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ (BRS)లో చేరేందుకు క్యూ కడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితికి (Bharat Rashtra Samithi) ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ విలీనం (Merged) కాగా తాజాగా మరో పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ విలీన ప్రక్రియ జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ (Hyderabad)లోని ప్రగతి భవన్ (Pragati Bhavan)లో సీఎం కేసీఆర్ ను ఆదివారం మహారాష్ట్రకు చెందిన భూమి పుత్ర సంఘటన (Bhumiputra Sanghatana) పార్టీ ప్రతినిధులు కలిశారు. అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తమ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేస్తామని భూమి పుత్ర సంఘటన పార్టీ సంస్థాపక అధ్యక్షుడు సంతోశ్ వాడేకర్ (Santosh Wadekar) ప్రకటించారు. అనంతరం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ స్వాగతించారు.
వారితో పాటు ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీ, గోండ్వానా పార్టీకి చెందిన తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో..భూమి పుత్ర నాయకులు కిరణ్ వాబాలే, అవినాశ్ దేశ్ ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్ బాయి షేక్, కాంగ్రెస్ నాయకుడు సమాధాన్ అర్నికొండ, ఆప్ నాయకుడు దీపక్ కొంపెల్వార్, యోగితా, రామ్, త్రిలోక్ జైన్, సంతోశ్ కాంబ్లే, అఖిల భారతీయ క్రాంతి దళ్ సంఘటన ప్రతినిధులు లక్ష్మీకాంత్, గణేశ్, సంతోశ్ గౌర్, గోండ్వానా పార్టీ నాయకులు నిఖిల్ దేశ్ ముఖ్, ప్రణీత, వర్ష కాంబ్లే, కల్పన, పూనమ్ అలోర్ తదితరులు చేరారు.