»Hyderabad Bsp Cheif Mayawati Declares Rs Praveen Kumar As Cm Face In Telangana
Telangana సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మాయావతి సంచలన ప్రకటన
మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ బీసీ జనగణన చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు (Elections) సమయం ముంచుకొస్తోంది.. రాజకీయ పార్టీలు సమర శంఖాలు పూరిస్తున్నాయి.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.. ఇక గెలిస్తే ముఖ్యమంత్రులు ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) (Bahujan Samaj Party -BSP) తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే విషయాలు కూడా పంచుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని సరూర్ నగర్ (Saroor Nagar) మైదానంలో ఆదివారం ‘తెలంగాణ భరోసా సభ’ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మాయవతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీలో తాను అధికారంలో ఉన్నప్పటికీ పథకాలు ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కాపీ కొట్టారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ కాపీ కొట్టిన పథకమేనని చెప్పారు. అధికారంలోకి వస్తే మెరుగైన పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీఎస్పీ (BSP) మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ప్రజల కోసం ఉద్యోగాన్ని వదులుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా (CM Candidate) ప్రకటిస్తున్నట్లు మాయావతి తెలిపారు. తమ పార్టీ బలోపేతమవుతుందని గ్రహించి కొత్త సచివాలయానికి (Secretariat) అంబేడ్కర్ పేరు, అంబేడ్కర్ భారీ విగ్రహం నిర్మించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అంబేడ్కర్ పై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు. బ్యాలెట్ పత్రాలు ఉన్నప్పుడు తాము గెలిచామని, ఈవీఎంలు (EVMs) మాయ చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షాపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో అడుగుపెట్టనీయమని అమిత్ షాను హెచ్చరించారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ (Modi) బీసీ జనగణన చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ పై నీలి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఎస్పీ ఇచ్చిన హామీలు (Promises)
– 60 నుంచి 70 సీట్లు బీసీలకే కేటాయింపు
– భూమి లేని ప్రతి ఒక్కరికీ ఎకరం భూమి.
– 10 లక్షల ఉద్యోగాల కల్పన
– గల్ఫ్ కార్మికులకు రూ.5 వేల కోట్లు
– కౌలు రైతులకు సంక్షేమ నిధి
తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. 🙏🙏🙏 pic.twitter.com/m1aZDjc729
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 7, 2023