బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే స్పందించారు అని రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
RS Praveen Kumar says BSP chief Mayawati has agreed to alliance with BRS
RS Praveen Kumar: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళా తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుల విషయం చర్చనీయాంశం అయింది. తాజాగా పొత్తుపై బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో స్పిందించారు. తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త. అంటూ పోస్ట్ చేశారు.
“బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బెహన్జీ గారు అనుమతించారని బీయస్పీ హై కమాండ్ తెలిపింది. త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీయస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, శ్రీ రాంజీ గారు బెహన్జీ దూతగా హాజరు కానున్నారు.”
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త! బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో…