RS Praveen Kumar: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఆయన రెండు స్థానాల్లో పోటీకి కూడా ఒప్పందం జరిగింది. ఈ లోపే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేయడంతో తెలంగాణ బీఎస్పీ శ్రేణులకు అర్థం కాని పరిస్థితి. ఆయన అధికారిక ట్విట్టర్ ఇలా రాసుకొచ్చారు.
“పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.”
Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of…