»Brs Has Announced Two More Mp Candidates Four More Seats Are Pending
BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఇంకా నాలుగు స్థానలు పెండింగ్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 13 మందిని ప్రకటించింది. త్వరలోనే మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
BRS has announced two more MP candidates..Four more seats are pending.
BRS: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంతో పకడ్బందీగా ప్రకటిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో మరో రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పిటికే 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నత పదవుల్లో కొనసాగిన వారే కావడం విశేషం. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలు, హైదరాబాద్, సికింద్రబాద్, నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. ఇందులో నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి(ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం -నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
మెదక్ – వెంకట్రామిరెడ్డి
నాగర్ కర్నూలు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్