»We Will Release A White Paper On Dharani Soon Minister Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy: ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి ఫోర్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
We will release a white paper on Dharani soon Minister Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy: గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఫోర్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని, త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణికి సంబంధించి చాలా విషయాలు తమ వద్ద ఉన్నాయి అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను అతి త్వరలో ప్రక్షాళన చేస్తామన్నారు. అలాగే నీళ్లు లేవు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మంత్రి తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయదని వెల్లడించారు.
ఆకాల పంటనష్టం జరిగిందని, వడగళ్ల వర్షానికి తెలంగాణలోని రైతులు చాలా నష్టపోయారు అని, నష్టపోయిన ప్రతీ రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు గ్రామాలను ఆయన పర్యటించారు. వడగళ్ల వలన నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులను తప్పకుండా ఆదుకుంటామని హామి ఇచ్చారు.