america : అమెరికాలో హైదరాబాదీ విద్యార్థిని కిడ్నాప్ చేసిన డ్రగ్‌మాఫియా
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు అక్కడ కిడ్నాప్‌కు గురయ్యాడు. అక్కడి డ్రగ్ మాఫియా నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఏమనంటే...?
Hyderabad student missing : చదువుకోవడానికి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన అబ్దుల్(Abdul) అనే విద్యార్థి అక్కడ కిడ్నాప్‌కు గురయ్యాడు. అక్కడి డ్రగ్ మాఫియాకి చెందిన కొందరి నుంచి హైదరాబాద్‌లోని నాచారంలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తమకు అమెరికా డాలర్ల రూపంలో డబ్బు పంపించాలని లేదంటే యువకుడి కిడ్నీలు అమ్మేస్తామని వారి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.
మార్చి 8వ తేదీ నుంచి తమ కుమారుడు ఫోన్లో అందుబాటులో లేడని అబ్దుల్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడిని రక్షించాలని కోరుతూ అబ్దుల్ తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్ మహ్మద్(25) 2023 మేలో ఉన్నత విద్య కోసం అమెరికా(america) వెళ్లాడు. ఒహయ్యో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. చివరి సారిగా ఈ నెల 7న తండ్రితో మాట్లాడాడు. తర్వాత అబ్దుల్‌కి(Abdul) ఫోన్ చేసినా స్పందన లేదు.
దీంతో తల్లిదండ్రులు ఈ విషయమై కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. చివరి సారిగా 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో అతడు కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. రోజులు గడుస్తున్నా ఆచూకి తెలియలేదు. అయితే మంగళవారం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నాచారంలోని తల్లిదండ్రులకు ఫోన్‌కాల్ వచ్చింది. అబ్దుల్ని తాము కిడ్నాప్(kidnap) చేశామని వారు చెప్పారు. అరగంట లోపు డబ్బు పంపకపోతే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.