Prabhas: 50 రోజుల్లో కల్కి.. ఇక కంప్లీట్ చేయనున్న ప్రభాస్?
ప్రభాస్ నుంచి ఈ సమ్మర్లో రావాల్సిన కల్కి సినిమా.. అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో కల్కి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతోంది. కానీ సినిమా రిలీజ్‌కు యాభై రోజులే ఉంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కల్కి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా ఇప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు కదా.. పోస్ట్ పోన్ అయిందనే ప్రచారం జరుగుతోంది. మే 9న రిలీజ్ చేసేందుకు కల్కి సినిమా షెడ్యూల్ చేయబడింది. కానీ ఎన్నికల నగరా మోగడంతో ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో కల్కి వాయిదా పడుతుందా? లేదా? అనేది డైలమాలో పడిపోయింది. కానీ కల్కికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవారంతో ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ఇటలీలో స్పెషల్ సాంగ్ షూట్ చేసిన చిత్ర యూనిట్.. ప్రస్తుతం ప్రభాస్‌తో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉందట. ఈ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ కల్కి పార్ట్ 1కు సంబంధించిన షూటింగ్‌ను మొత్తం పూర్తి చేసుకున్నట్టేనని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూసే అయినా.. పోస్ట్‌పోన్ రూమర్ మాత్రం అప్సెట్ చేస్తోంది. పైగా సినిమా రిలీజ్‌కు మరో యాభై రోజులు మాత్రమే ఉంది. దీంతో.. కల్కి రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ కావాలని అంటున్నారు అభిమానులు. మరి మేకర్స్ కల్కి వాయిదా పై స్పందిస్తారేమో చూడాలి.