ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప2. ఈ సినిమా నుంచి తాజాగా రష్మిక లుక్ లీక్ అవగా తెగ వైరల్ అవుతోంది.
Srivalli's leaked look is viral.. Looks like Jejemma! Pushpa2
Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. వెయ్యి కోట్లు టార్గెట్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే.. మొదటి నుంచి పుష్ప2 సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవుతునే ఉన్నాయి. గతంలో బన్నీ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. అలాగే యాక్షన్‌కు సంబంధించిన వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించింది రష్మిక. కానీ లేటెస్ట్ లీక్డ్ లుక్‌లో మాత్రం రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి మహాలక్ష్మిలా ఉంది. దీంతో పార్ట్ 2లో రష్మిక ఫుల్ గ్లామర్‌గా కనిపించనుందని చెప్పొచ్చు.
అయితే.. ఈ లుక్‌లో రష్మికను చూసిన నెటిజన్స్ అరుంధతిలో జేజెమ్మలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవల్లి లీక్డ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కానీ కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ పై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి లీకులు జరగకుండా చూసుకోవాలని అంటున్నారు. దీని వల్ల సినిమా పై ఉన్న హైప్ తగ్గుతుందని వాపోతున్నారు. అయినా కూడా లీకులు మాత్రం ఆగడం లేదు. ఇక ఈ సినిమాను ఆగష్టు 15న విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి పుష్ప2 ఎలా ఉంటుందో చూడాలి.