»Karnataka Elections After Karnataka Our Next Target Is Telangana Says Jairam Ramesh
Karnataka తర్వాత మా టార్గెట్ తెలంగాణ: జై రామ్ రమేశ్ ప్రకటన
40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారు. అవినీతి ప్రభుత్వాన్ని దహనం చేయడం మాత్రం గ్యారంటీ. తన పర్యటనతో ప్రధాని మోదీ బెంగళూరులో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
కర్ణాటక ఎన్నికలు (Karnataka Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. సోమవారంతో ప్రచారం ముగుస్తుంది.. బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేసిన జాతీయ పార్టీలు ఇక కన్నడ సీమను వదిలి తెలంగాణలోకి (Telangana) వాలిపోనున్నాయి. ఈ ఏడాది చివరలో జరుగనున్న తెలంగాణ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జై రామ్ రమేశ్ (Jairam Ramesh) ఇదే విషయాన్ని చెప్పారు. ‘కర్ణాటక తర్వాత మా తదుపరి లక్ష్యం తెలంగాణ’ అని ప్రకటించారు.
బెంగళూరులో (Bengalore) ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కర్ణాటక ఎన్నికల సరళిపై జైరామ్ రమేశ్ మాట్లాడారు. ‘వచ్చేది మా ప్రభుత్వమే. స్పష్టమైన మెజారిటీ 130 సీట్లు దాటి దాటి అధికారం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవసరం రాదు. 40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారు. అవినీతి ప్రభుత్వాన్ని దహనం చేయడం మాత్రం గ్యారంటీ. తన పర్యటనతో ప్రధాని మోదీ బెంగళూరులో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దేశంలో సమస్యలు తీవ్రంగా ఉంటే ఆయన మాత్రం రాజకీయాల కోసం ఇక్కడకు వచ్చారు. ప్రధాని టూర్ అంతా తమాషా’ అని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులందరికీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీసుకుంటారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే మా తర్వాతి లక్ష్యం తెలంగాణ’ అని జైరామ్ రమేశ్ తెలిపారు.