»Wrestlers Protest Khap Mahapanchayat Held In Delhi Security Tightened
Wrestlers Protest భారత రెజ్లర్ల ఉద్యమం తీవ్రం.. ఢిల్లీలో తీవ్ర ఆంక్షలు
బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసే దాక తమ ఉద్యమం ఆపేది లేదని మరోసారి రెజ్లర్లు స్పష్టం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నడిపిన సుదీర్ఘ ఉద్యమం స్ఫూర్తితో తాము ఈ పోరాటం చేస్తామని రైతు సంఘాల నాయకులతో రెజ్లర్లు తెలిపారు.
తమపై లైంగిక దాడులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు (Wrestlers) చేస్తున్న ఉద్యమం ఉధృతంగా మారింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantal Mantar) చేపట్టిన ఉద్యమంలో కీలక మలుపు తిరిగింది. వీరి ఆందోళనకు రైతు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. అప్పట్లో తాము చేసిన వీరోచిత పోరాట స్ఫూర్తితో డిమాండ్ నెరవేరే దాక ఉద్యమించాలని రెజ్లర్లకు రైతు సంఘం నాయకులు సూచించారు. కాగా ఉద్యమం తీవ్రమవడంతో ఢిల్లీలో తీవ్ర ఆంక్షలు (Restrictions) విధించారు. పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు (Special Forces) మోహరించాయి.
జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి ఆదివారానికి 15 రోజులైంది. ఈ సందర్భంగా ‘ఖాప్ మహా పంచాయతీ’ (Khap panchayat) పేరిట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు భారత్ కిసాన్ యూనియన్ (Bhartiya Kisan Union -BKU), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) తదితర సంఘాలు, పార్టీలు రెజ్లర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. సాక్షిమాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్ తదితరులతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.
బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ (Arrest) చేసే దాక తమ ఉద్యమం ఆపేది లేదని మరోసారి రెజ్లర్లు స్పష్టం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నడిపిన సుదీర్ఘ ఉద్యమం (Movement) స్ఫూర్తితో తాము ఈ పోరాటం చేస్తామని రైతు సంఘాల నాయకులతో రెజ్లర్లు తెలిపారు. కాగా రెజ్లర్ల ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఢిల్లీలో తీవ్ర ఆంక్షలు విధించారు. ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాల్, జమ్మూ కశ్మీర్ లను కలిపే 44 వ నంబర్ జాతీయ రహదారి చుట్టూ భద్రత చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా పోలీసులు మొహరించారు.