NZB: ఆలూరు మండలం మిరపల్లి గ్రామంలో జరిగిన 2వ సాధారణ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి యల్లా సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు లేకపోవడంతో ఆయన ఎన్నిక ఖరారైంది. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అందరికీ అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందిస్తానని తెలిపారు.