Bharat Jodo Nyay Yatra : లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతోంది. ప్రస్తుతం ఈశాన్య భారతంలో ఈ ప్రయాణం సాగుతోంది. న్యాయ యాత్రకు సంబంధించి అస్సాం ప్రభుత్వం యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని, యాత్రలో పాల్గొన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు అసోంలో తన వాహనంపై బీజేపీ వ్యక్తులు దాడి చేశారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు.
జైరామ్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు వ్యతిరేకంగా దాడి చేసిన వ్యక్తులు స్టిక్కర్‌పై నీళ్లు చల్లారని, నినాదాలు చేశారని ఆయన అన్నారు. ఇది అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ చేయిస్తున్నాడు. కానీ మేం భయపడం, పోరాటం కొనసాగిస్తామని రాసుకొచ్చారు.
My vehicle was attacked a few minutes ago at Jumugurihat, Sunitpur by an unruly BJP crowd who also tore off the Bharat Jodo Nyay Yatra stickers from the windshield. They threw water and shouted anti-BJNY slogans. But we kept our composure, waved to the hooligans and sped away.… pic.twitter.com/IabpNa598P
రాహుల్ గాంధీ నేతృత్వంలోని న్యాయ యాత్ర ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ నుంచి విశ్వనాథ్ మీదుగా అసోంలోకి మరోసారి ప్రవేశించింది. యాత్ర అస్సాంకు తిరిగి వచ్చిన సందర్భంగా, రాబోయే ఎన్నికల్లో బీజేపీపై భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ పేర్కొన్నారు. అస్సాం ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, “రాహుల్ గాంధీ లేదా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి భయపడరు. మీరు ఏది కావాలంటే అది చేయవచ్చు… కానీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.