»Arequipa Gold Mine 27 Dead In Gold Mine Fire Tragedy In Peru
Gold Mineలో విషాదం.. బంగారు గనిలో అగ్నికి 27 మంది కార్మికులు ఆహుతి
కాకపోతే అప్పటికే దట్టంగా వ్యాపించిన మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. కాగా భూగర్భంలో వంద మీటర్ల లోతున కార్మికులు పని చేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
బంగారు గనిలో (Gold Mine) విషాదం (Tragedy) సంఘటన చోటుచేసుకుంది. బంగారు తవ్వకాల్లో ఘోరం జరిగింది. గనిలో (Mine) జరిగిన అగ్ని ప్రమాదంతో ఏకంగా 27 మంది కార్మికులు మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో దక్షిణ అమెరికా దేశం పెరూలో (Peru) తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పెరూ ఉన్నత అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పెరూ యనక్విహువా (Yanaquihua) జిల్లా అరెక్విపా ప్రాంతంలో ఉన్న లా ఎస్పారంజా -1 గనిలో ఆదివారం షార్ట్ సర్క్యూట్ (Short Circuit) సంభవించింది. ఆ వెంటనే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఆ మంటల నుంచి కార్మికులు బయటపడలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కాకపోతే అప్పటికే దట్టంగా వ్యాపించిన మంటల్లో (Fire) కార్మికులు చిక్కుకున్నారు. కాగా భూగర్భంలో (Under Ground) వంద మీటర్ల లోతున కార్మికులు పని చేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబసభ్యులు గని ప్రాంతానికి చేరుకున్నారు. తమ వారికి ఏమైందోనని అధికారులను నిలదీశారు. కాగా వారిని ఓదార్చి శాంతపరిచారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పెరూలోని ప్రముఖులు సంతాపం ప్రకటించారు.