»3 Workers Dead In Explosion At Firecracker Factory In In Tirupati District
Tirupati Districtలో ఘోరం.. బాణసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
గిడ్డంగి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలోని తిరుపతి జిల్లాలో (Tirupati District) ఘోర సంఘటన జరిగింది. బాణాసంచా గిడ్డంగిలో (Fireworks Godown) అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుని ఏకంగా ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఉవ్వెత్తున ఎగిసిన మంటలకు కార్మికులు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు (Police) మంటలు చల్లార్చే వరకు వరకు మంటలోనే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం..
వరదయ్యపాలెం (Varadaiahpalem) మండలం కువ్వాకుల్లి (Kuvvakulli) గ్రామంలో బాణసంచా గిడ్డంగి ఉంది. ఈ గిడ్డంగిలో యథావిధిగా బుధవారం ఆరుగురికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఏం జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు బాణసంచా (Crackers) పేలిపోయాయి. భారీ శబ్ధంతో దట్టమైన పొగ వ్యాపించి మంటలు తీవ్రమయ్యాయి. వీటి నుంచి కొందరు కార్మికులు (Workers) బయటపడగా.. ముగ్గురు కార్మికులు మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. తప్పించుకోలేక విష వాయువులకు తోడు మంటల్లో సజీవ దహనమయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. అగ్ని మాపక (Fire Department) సిబ్బంది మంటలను ఆర్పివేసింది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కువ్వాకుల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో వారి కుటుంబసభ్యులు (Family Members) కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, గిడ్డంగి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.