సంచలనాల కోసం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువత పిచ్చిపిచ్చి వేషాలకు (Stunts) పాల్పడుతున్నారు. వెర్రి వేషాలు వేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సాహసాలకు (Adventures) ఒడిగట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వైరల్ (Viral) కావడం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడితో కాసిన పందెం (Challenge) కోసం నడిరోడ్డుపై స్నానం (Bath on Road) చేశాడు. ఇంతకీ ఆ పందెం ఎంతకో తెలుసా? కేవలం పది రూపాయల కోసం కావడం గమనార్హం. కాగా, రోడ్డుపై విచిత్ర వేషాలకు పాల్పడిన ఆ యువకుడికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
ఈ రోడ్డు జిల్లాలోని (ERode District) వెల్లోడ్ కు చెందిన ఎం. ఫారూక్ (24) అనే యువకుడికి సాహసాలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో (Social Media) పోస్టు చేసే అలవాటు ఉంది. లైక్స్ లు, ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు పెంచుకోవడానికి స్నేహితుడితో పందెం కట్టాడు. ఈనెల 29వ తేదీన పందెంగా రూ.10 నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫారూక్ స్కూటీలో నీళ్ల బకెట్ (Water Bucket) తీసుకుని రోడ్లపైకి వచ్చాడు. సిగ్నళ్ల (Traffic Signal) వద్ద బకెట్ నీళ్లతో స్నానం చేశాడు. ఈ సందర్భంగా రోడ్డుపై నిల్చున్న వాహనదారులను కూడా నీళ్లు పోయమని కోరాడు. ఇదంతా వీడియో తీయించాడు.
ఈ వీడియోను చూసిన పోలీసులు (Police) ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నారు. పందెంలో రూ.10 గెలిచాడు.. కానీ పోలీసులు రూ.3,500 జరిమానా (Fine) విధించారు. ఈ వీడియో చూసిన డీఎస్పీ జవార్ ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ యువకుడిపై కేసు కూడా నమోదు చేశారు. రోడ్లపై.. రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు (Serious Action) తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
Youth from Vellode, took a bath in a public place in Erode on Sunday with the intention of posting a video on Instagram and getting likes. Erode town Police fined him on Monday for acting as a wrong guide to the younger generation.@NewIndianXpress@mannar_mannan@Senthil_TNIEpic.twitter.com/N8Y2QfjXJY
— Srinivasan Perumal (@ShrinJournalist) May 29, 2023