»Haryana Young Man Does Push Ups On Moving Car In Gurugram Case Filed After Video Surfaces
Push Ups on Car యువకుల వెర్రి: కదులుతున్న కారుపై పుషప్స్.. తాగి రచ్చరచ్చ
కదులుతున్న కారుపైన పుషప్స్ చేస్తూ అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు. దీంతోపాటు కారు ముందు అద్దాలపై నుంచి బయటకు వచ్చి ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వెర్రికి పోలీసులు బుద్ధి చెప్పారు.
కొందరు యువకులు సంచలనం కోసం సాహసాలకు ఒడిగడుతారు. వీరి వెర్రి ఒక్కోసారి తలకెక్కుతుంది. మద్యం మత్తులో (Drunk) ఉంటే మరింత రెచ్చిపోయి దారుణంగా వ్యవహరిస్తారు. హర్యానాలో (Haryana) యువకులు వెర్రివేషాలకు దిగారు. కదులుతున్న కారుపైన (Car) పుషప్స్ చేస్తూ అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు. దీంతోపాటు కారు ముందు అద్దాలపై నుంచి బయటకు వచ్చి ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. వీరి వెర్రికి పోలీసులు బుద్ధి చెప్పారు. వారిపై కేసు నమోదు చేశారు.
మే 30వ తేదీన రాత్రిపూట గురుగ్రామ్ (Gurugram) పట్టణంలో కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. మద్యం (Drunk and Drive) తాగుతూ కేకలు వేస్తూ రచ్చరచ్చ చేస్తూ రోడ్డుపై ప్రయాణం చేశారు. అంతటితో ఆగకుండా కారు టాప్ పై కూర్చుని పుషప్స్ (Push ups) చేశారు. ఐదు సార్లు పుషప్స్ చేశాడు. అంతటితో ఆగకుండా పైకి లేచి ఏదో ఘనత సాధించినట్లు విజయ చిహ్నం (Victory Symbol) చూపాడు. దీనికి కారు అద్దాలపై నుంచి బయటకు వచ్చిన మరో ముగ్గురు కేకలు వేస్తూ అతడిని ప్రోత్సహించారు.
ఇది రోడ్డుపై ప్రయాణం చేస్తున్న మిగతా వాహనదారులు (Passengers) ఈ తతంగమంతా వీడియో తీశారు. మరొకరు గురుగ్రామ్ పోలీసులకు (Gurugram Police) ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ కారును స్వాధీనం చేసుకుని ఆ కారు యజమానికి రూ.6,500 జరిమానా (Fine) విధించారు. కారుపై ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన (Rules Break) యువకులను గాలిస్తున్నట్లు గురుగ్రామ్ ట్రాఫిక్ డీసీపీ విజేందర్ విజ్ (Virender Vij) తెలిపారు. ఇలాంటి స్టంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.