»Meenakshi Lekhi Runs After Facing Questions On Wrestlers Protest
Wrestlersపై స్పందించలేక పరుగెత్తిన కేంద్ర మంత్రి.. ‘చలో చలో’ అంటూ ఒకటే పరుగు
అసలు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు రెజ్లర్లపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు. ఇదే విషయాన్ని ఓ కేంద్ర మంత్రిని మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పరుగు పెట్టారు. ఎక్కడ ఆగకుండా పరుగు పరుగున తన కారు వద్దకు వెళ్లారు.
ప్రపంచ వేదికలపై భారతదేశ గౌరవాన్ని సగర్వంగా నిలిపిన రెజ్లర్లు (Wrestlers) స్వదేశంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారిపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తమను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్ట్ చేయాలని రోడ్ల మీదకెక్కారు. దాదాపు రెండు నెలలుగా చేస్తున్న ఉద్యమం (Protest) రోజురోజుకు తీవ్రమవుతోంది. అయితే రెజ్లర్లపై పోలీసులు (Delhi Police) విచక్షణారహితంగా దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం (Modi Govt) స్పందించడం లేదు. అసలు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు రెజ్లర్లపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు. ఇదే విషయాన్ని ఓ కేంద్ర మంత్రిని మీడియా (Media) ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పరుగు (Run) పెట్టారు. ఎక్కడ ఆగకుండా పరుగు పరుగున తన కారు వద్దకు వెళ్లారు.
ఢిల్లీలోని (Delhi) ఓ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) బయటకు వచ్చారు. బయట ఉన్న ఓ మీడియా ప్రతినిధి కేంద్ర మంత్రి మీనాక్షిని రెజ్లర్ల అంశంపై ప్రస్తావించారు. ఆమె ప్రశ్న (Question) అడుగుతుండగానే కేంద్ర మంత్రి పరుగు పెట్టారు. ‘రెజ్లర్ల ఆందోళన విషయంపై మీ స్పందన ఏమిటి? రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో కలపడంపై మీరు ఏం అంటారు?’ అని ఆమె ప్రశ్నించగా మీనాక్షి లేఖి సమాధానం చెప్పేందుకు అంగీకరించలేదు.
రిపోర్టర్ వెంటాడడంతో ‘చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది’ అని మీనాక్షి లేఖి పరుగెత్తుకుంటూ చెప్పారు. మీడియా ప్రశ్నిస్తుండగా తప్పించుకుని పరిగెత్తారు. ‘పద పద’ అంటూ భద్రతా సిబ్బందిని కూడా ఆమె పరుగెత్తించారు. కారు (Car) వద్దకు చేరుకోగానే మైక్ (Mice) పెట్టగా ఆమె సిబ్బంది పక్కకు నెట్టేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. రెజ్లర్లపై స్పందించేందుకు కూడా బీజేపీ నాయకులు భయపడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ (C0ngress Party) తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది.