»I Will Work Any Where Says Former Cm Nallari Kiran Kumar Reddy
Telanganaలోనైనా రాజకీయంగా పని చేస్తా: మాజీ సీఎం కిరణ్ కుమార్
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణపై విషం చిమ్మిన వ్యక్తి.. రూపాయి ఇవ్వనని చెప్పిన మనిషి ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ‘తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేస్కుంటావో చేస్కో పో’ అన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే తెలంగాణలో పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడుగడుగునా తెలంగాణపై (Telangana) విషం చిమ్మిన వ్యక్తి.. రూపాయి ఇవ్వనని చెప్పిన మనిషి ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు (Politics) చేస్తానని చెప్పారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy). అసెంబ్లీ వేదికగా ‘తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేస్కుంటావో చేస్కో పో’ అన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే తెలంగాణలో పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆయన ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ను తెలంగాణలో వినియోగించుకునేందుకు బీజేపీ చేర్చుకున్నట్లు చర్చ నడుస్తోంది. ఇదే విషయమై తాజాగా ఆయనను మీడియా ప్రశ్నించగా.. పై విధంగా స్పందించారు.
హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubilee Hills) లోని నివాసంలో కిరణ్ తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju), పార్టీ సీనియర్ నాయకుడు మధుకర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాజీ సీఎం మాట్లాడుతూ.. ‘బీజేపీలో చేరిన తర్వాత నెల రోజుల పాటు అమెరికాకు వెళ్లాను. ఏపీలో పాలనపై సమయం, సందర్భంగా వచ్చినప్పుడు స్పందిస్తా. పార్టీ అధిష్టానం (High Command) ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తా’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘కిరణ్ ను మర్యాదపూర్వకంగా కలిశాం. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ఆయనకు వివరించాం. కిరణ్ నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకున్నాం. ఆయన మార్గ నిర్దేశనంలో పని చేస్తాం’ అని తెలిపారు.