BPT: కొరిశపాడు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 16 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రాంబాబు బుధవారం తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రామాలలో గాలికుంటు టీకాలు వేస్తామని చెప్పారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన కోరారు. పశువులకు గాలికుంటు సోకితే రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.