BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.