ATP: అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్తు బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్లకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.