AKP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు 160 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,088 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 2,928 మంది హజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలా జరుగుతున్నాయో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆయన పరిశీలించారు. అలాగే, పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు.