ASF: సిర్పూర్ టౌన్ సామాజిక ఆసుపత్రిలో బుధవారం HPV టీకా కార్యక్రమాన్ని MLA డా.హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఒక టీనేజ్ అమ్మాయికి MLA వాక్సినేషన్ చేశారు. MLA మాట్లాడుతూ.. 14-15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పకుండా HPV వాక్సినేషన్ చేయించుకోవాలని, తద్వారా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.