TG: తమ ప్రభుత్వంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం తప్ప ఏమీ లేదన్నారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు ఉన్నారని విమర్శించారు. వెలుగుమట్లలో మంత్రులకు రియల్ ఎస్టేట్‌కు ఇబ్బంది అవుతోందని.. పేదల ఇళ్లు కూల్చారని మండిపడ్డారు.