NTR: విజయవాడ నగరంలోని గాయత్రి నగర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సురక్ష సేవ కన్వీనర్ నరసయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ, 9వ తరగతి విద్యార్థినుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్ళు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు 200 సైకిళ్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.