MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో పలు సమస్యలపై బుధవారం వివిధ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.