15 killed after clash breaks out between 2 tribes over delimitation of coal mine in Pakistan
Pakistan:పాకిస్థాన్లో (Pakistan) రెండు గిరిజన తెగల మధ్య గొడవ జరిగింది. పెషావర్ సమీపంలో గల కొహట్ (kohat) జిల్లా దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో బొగ్గు గనుల కేటాయింపు విషయంలో సున్నీఖేల్, జర్గున్ ఖేల్ తెగల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో 15 మంది చనిపోయారు. గాయపడ్డవారిని పెషావర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి సంఖ్య తెలియలేదని పోలీసులు (police) తెలిపారు. ఘర్షణ జరగగా.. అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు చనిపోయారని వివరించారు.