అనకాపల్లి మండలం బట్లపూడి గ్రామ పరిధిలో గల ఎరకన్ను దొరచెరువులో పూడికతీత పనులు త్వరలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. 300 ఎకరాలకు సాగునీరందించే చెరువును ఆయన శుక్రవారం పరిశీలించారు. చెరువు పూడిక వేయడంతో ఆయకట్టు దారులకు సాగునీరు అందడం లేదని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.