యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 4-1తో చిత్తు చేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది. 87.50 విజయాల శాతంతో దాదాపు WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. యాషెస్‌లో భారీ ఓటమితో ఇంగ్లండ్ 7వ స్థానానికి పడిపోయింది. భారత్ మాత్రం 6వ స్థానంలోనే కొనసాగుతోంది.