• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యాసంగి సీజన్‌లో ప్రారంభమైన వరి కోతలు

JGL: ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో అన్నదాతలు బిజీగా ఉన్నారు. ఇక రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడానికి సరైన స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రధాన రహదారులపై ఎండబోస్తున్నారు. ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలాలు ఏర్పాటు చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.

April 13, 2026 / 11:44 AM IST

కో ఆప్షన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిపత్యం

NRML: నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 వార్డులకు గాను 24 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజార్టీని సొంతం చేసుకుంది. కాగా, BJP 13, MIM3, BRS కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో మున్సిపల్ పీఠంతో పాటు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కూడా కాంగ్రెస్ పరం కానుంది.

April 13, 2026 / 11:43 AM IST

SSC CGLలో ఆల్ ఇండియా 102వ ర్యాంక్

NZB: జాతీయ స్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)లో NZB ట్రాన్స్‌కో విజిలెన్స్ CI జక్కుల శంకర్ రావ్ పెద్ద కుమారుడు ప్రణయ్ ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ (examinar) ఉద్యోగానికి ఎన్నికయ్యారు. ప్రణయ్ జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాధించడంతో స్థానికులు అభినందించారు.

April 13, 2026 / 11:42 AM IST

నిరుపేద ఆడబిడ్డ వివాహానికి గ్రామస్థుల చేయూత

ASF: జైనూర్ మండలం మన్కుగూడ గ్రామస్థులు గ్రామానికి చెందిన కుమ్రా కొద్దు-సక్రబాయి, రుక్మబాయిల కుమార్తె సుమన్ బాయి వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా గ్రామ ప్రజలంతా ఏకమయ్యారు. తమ వంతు సాయంగా రూ.18,600 విరాళాన్ని సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. గ్రామంలో జరిగిన ప్రతి వివాహానికి అండగా ఉంటామని,పేదలకు తోడుగా నిలుస్తామని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.

April 13, 2026 / 11:41 AM IST

‘మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి’

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్లమెంటులో మహిళా బిల్లుతోపాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోట రిజర్వేషన్లను అమలు చేయాలని సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు న్యాయం జరగలేదన్నారు.

April 13, 2026 / 11:40 AM IST

శ్రీపాదరావు విగ్రహానికి నివాళులర్పించిన ఛైర్మన్

BHPL: మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనునిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే పేదలకు అండగా శ్రీపాదరావు నిలిచారని, శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని ప్రకాష్ రెడ్డి అన్నారు.

April 13, 2026 / 11:39 AM IST

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: బిచ్కుంద మండలం పెద్ద దేవాడలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శోభ గంగాధర్ ప్రారంభించారు. ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపి కేంద్రంలోని ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, తదితరులు ఉన్నారు.

April 13, 2026 / 11:39 AM IST

అధ్వాన్నంగా రోడ్డు.. రైతుల అవస్థలు

SRPT: అనంతగిరి మండలంలోని అజ్మీరా తండా-ఖానాపురం మధ్య రోడ్డు గుంతల మయంగా మారింది. వరి కోత యంత్రాలు, ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు వీల్లేకుండా పోయింది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

April 13, 2026 / 11:39 AM IST

ఆడపడుచులకు చీరల పంపిణీ తో ఆహ్వానం

SRD: కంగ్టి మండలం చాప్ట కేలో సోమవారం ప్రతి ఇంటి ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేశారు. స్థానికంగా నిర్మించిన మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 19న నిర్వహిస్తున్నందున ప్రతి ఇంటి ఆడపడుచులను ఆహ్వానిస్తూ చీరలను పంపిణీ చేసినట్లు గ్రామ నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణకు పలువురు గురువులు వస్తున్నారని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

April 13, 2026 / 11:37 AM IST

ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చేయాలి: ఝాన్సీరెడ్డి

JN: పాలకుర్తిలో హెచ్ మార్ట్ సూపర్ మార్కెట్‌ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. సూపర్ మార్కెట్ ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందని, నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందించి ప్రజల విశ్వాసాన్ని పొందాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని యాజమాన్యానికి ఝాన్సీరెడ్డి సూచించారు.

April 13, 2026 / 11:36 AM IST

ఇంటర్‌లో సామ్య నాయక్ తండా విద్యార్థి రికార్డు

NGKL: తిమ్మాజిపేట మండలం సామ్య నాయక్ తండాకు చెందిన మూడవత్ సాయికుమార్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచాడు. ఎంపీసీ విభాగంలో 470కి గాను 467 మార్కులు సాధించి సత్తా చాటాడు. విద్యే అన్ని సమస్యలకు పరిష్కారమని ఈ సందర్భంగా సాయికుమార్ పేర్కొన్నాడు. ఘనత సాధించిన విద్యార్థిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా అభినందించారు.

April 13, 2026 / 11:34 AM IST

బోడుప్పల్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ పర్యటన

MDCL: బోడుప్పల్‌లో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విస్తృత స్థాయి పరిశీలన చేపట్టారు. శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో శానిటేషన్ కార్మికులు, ఆటో డ్రైవర్లు, స్థానికులతో మాట్లాడి రోడ్లపై నిల్వ నీటి సమస్యలను తెలుసుకున్నారు. రాజశేఖర్ కాలనీలో ట్రేడ్ లైసెన్సులు పరిశీలించి, C&D వ్యర్థాల సరైన నిర్వహణపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.

April 13, 2026 / 11:33 AM IST

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: SI

HNK: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రమేష్ నాయక్ అన్నారు. పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు “నో హెల్మెట్-నో ఎంట్రీ” బోర్డును గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ రాజేశ్వరరావు, ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:33 AM IST

ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారం

MNCL: ఇందిరమ్మ ఇళ్లు పథకంతో పేదవారి సొంతింటి కల సాకారమవుతోందని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం 29వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారు గృహ ప్రవేశాన్ని డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 11:32 AM IST

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ADB: బోథ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మార్కండేయ స్వామి ఆలయానికి స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. గ్రామస్తులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు.

April 13, 2026 / 11:32 AM IST