WGL: రాయపర్తి మండలం AK తండా గ్రామానికి చెందిన గుగులోత్ మహేశ్వరీ (చిట్టి) ఇటీవల హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలుజల్లి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్యకు కారణమైన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
HYD: మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్ అధికారిక అకౌంట్‌లో తప్పుడు ట్వీట్ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. ట్వీట్‌లో 50% డిస్కౌంట్ అని పేర్కొనగా, ఫోటోలో మాత్రం 5% డిస్కౌంట్, చివరి తేదీ ఏప్రిల్ 30గా ఉంది. ఈ వ్యత్యాసంతో ప్రజలు 50% నిజం అనుకుని, ఓపెన్ చేస్తే డిస్కౌంట్ రావడం లేదని అంటున్నారు. ప్రజలు, అధికారిక సమాచారం విడుదలలో జాగ్రత్తలు అవసరమన్నారు.
MHBD: బయ్యారంలోని రామాలయ ఫంక్షన్ హాల్లో నేడు అఖిలపక్ష నేతలతో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ ఆంగోతు బిందు, పలు పార్టీల నేతలు హాజరై మాట్లాడుతూ.. బయ్యారంను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
NGKL: మరికల్ మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పాలెం నిరంజన్‌కు మంజూరైన CMRF చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఆర్థిక సాయం అందిందని ఆయన పేర్కొన్నారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్సీకి, మాజీ ఎమ్మెల్యేకు లబ్ధిదారుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కోస్గి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రైవేట్ కళాశాలకు చెందిన వరుణ్ సంతోష్, అయేషా మహీన్ ఎంపీసీ విభాగంలో 989/1000 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా అభినందించారు.
SDPT: అక్కన్నపేట మండలం పోతారం జె గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్షాధారిత పంటల అభివృద్ధి (RAD) పథకం కింద రైతులకు కూరగాయల పెట్టెలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయలు, ఆయిల్ ఫామ్, తేనెటీగలు, పట్టు వంటి ఆదాయపంటలు సాగు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 50–100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.
GDWL: మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పాల్గొని భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, దొడ్డప్ప, పచ్చర్ల కుమార్, మహమ్మద్ సిరాజు పాల్గొన్నారు.
GDWL: కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెతో పాటు పాల్గొన్నారు.
SRD: పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శివానందాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమం పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జరిగింది.
WGL: పూర్వ ఏబీవీపీ నాయకుడు గొల్ల నరేందర్ వివాహం ఆదివారం వరంగల్‌లో ఘనంగా జరిగింది. BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని నూతనవధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి, జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.
SRD: చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషిచేసి మధురమైన గానంతో ఆశాభోంస్లే పాడిన వేలాది పాటలు చిరస్మరణీయమని ఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ పేర్కొన్నారు. ఇవాళ ఆమె తుది శ్వాస విడిచిన సందర్భంగా రావి ఆకుపై ఆమె చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. ఈమేరకు పత్రంపై ఆమె చిత్రానికి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
NZB: మోపాల్ మండలం మంచిప్పకు చెందిన మమ్మద్ సలీమా ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 485 మార్కులు సాధించింది. ఆమె నిజామాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ మార్కులు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయుల బృందం ఆమెను అభినందించారు.
KNR: ఇంటర్ ఫలితాల్లో ఓదెల (M) గుంపుల గ్రామానికి చెందిన విద్యార్థిని పంజాల స్వాతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. శంకరపట్నం ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుతూ.. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు దీటుగా ఏకంగా 987 మార్కులు సాధించి సత్తా చాటింది. ఎలాంటి ఆర్భాటాలు లేని ప్రభుత్వ గురుకుల కళాశాలలో పక్కా ప్రణాళికతో చదివితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.
PDPL: మాల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు రామగుండం నియోజకవర్గ సంఘం అధ్యక్షులు మాలెం మధు తెలిపారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14న ఉదయం చౌరస్తా నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ, అనంతరం కాలి నడకన రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు ఐక్యత ర్యాలీ ఉంటుందన్నారు.
KMR: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి సూచించారు. ఆదివారం కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మహిళా విభాగం నాయకురాళ్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేసే పథకాలను లబ్ధిదారులకు అందే విధంగా చూడాలన్నారు.