శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్బంగా హైదరాబాద్లో మద్యం షాపులు, బార్ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణం (Ramulori wedding) సందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు.
శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్బంగా హైదరాబాద్లో మద్యం షాపులు, బార్ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణం (Ramulori wedding) సందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వైన్స్ షాపులకు (Wine shops)ఆదేశాలు జారీచేశారు.
నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయించితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు(Police)హెచ్చరించారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, 5 స్టార్ హుటల్స్ లోనూబార్ రూమ్స్ మూసేయాలని పోలీసులు ఆదేశించారు. శ్రీరామనవమి శోభాయాత్రల (Shobhayatra) సందర్బంగా శాంతి భద్రతా ఏర్పట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు .కాగా, భద్రాచలంలో సీత రామ కల్యాణం (Sita Rama Kalyanam) కనుల పండువగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సీఎం కేసీఆర్ అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలను పోలీసులు (Police) తీసుకుంటున్నారు.