Minister Roja సెటైర్స్.. వాళ్లంతా జగన్ చరిష్మాతోనే గెలిచారు..
Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు... టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు… టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు. అంతే కాదు పిల్లబిత్తిరీ లోకేష్ అంటూ కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేసింది. మంగళవారం మంత్రి రోజా సింహాంద్రి అప్పన్న దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
పిల్లబిత్తిరీ లోకేష్ ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని మాట్లాడుతున్నాడు..చంద్రబాబు కలలో కూడా గెలుపును ఊహించలేదని తెలిపారు. పార్టీ కమ్మిట్ మెంట్ ఉన్నవాళ్లు, పార్టీ పై నమ్మకం ఉన్నవాళ్లు పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు వేరే పార్టీకి వెళ్లినవారందరూ జగన్ చరిష్మాతో గెలిచినవారేనని విమర్శలు చేశారు.ఎక్కువ ఎమ్మెల్సీ గెలిచిన తాము కామ్ గా ఉన్నాం…అతి తక్కువ వొచ్చిన వారికి బలుపు ఎక్కువయిందని విమర్శలు చేశారు