AP: ప్రజలు అసహ్యించుకునేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు సమర్థ పాలన చూసి ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కల్తీమద్యంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.