»Minister Roja Criticizes Andhra Pradesh Congress Chief Ys Sharmila
Minister Roja: వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేది షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతుందని ఆరోపణ చేశారు. షర్మిల వలన ఏపీకి జరిగేది ఏమి లేదని వ్యాఖ్యానించారు.
Minister Roja criticizes Andhra Pradesh Congress chief YS Sharmila
Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల(YS Sharmila)కు ప్రాధాన్యత లేదని, కేవలం టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికే వచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శించారు. షర్మిలను నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునే అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు బాబును, నారా లోకేష్‌లను నమ్మే పరిస్థితి లేదని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలుత రంగంలోకి దించారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను ఉపయోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక చంద్రబాబు ఉన్నాడని, ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చేది కూడా బాబే అని పేర్కొన్నారు.
చంద్రబాబుకు షర్మిల కొడుకు పెళ్లి కార్డును స్వయంగా వెళ్లి ఇచ్చిందని, వైఎస్సార్‌ను తిట్టిన జనసేనాని పవన్ ఇంటికి కూడా వెళ్లి వెడ్డింగ్ కార్డు ఇచ్చిందని రోజా వెల్లడించారు. చంద్రబాబు కోవర్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో షర్మిల పొత్తు పెట్టుకుందని విమర్శించారు. వినేవాడు వెర్రివాడైతే, చెప్పేది షర్మిల అని వ్యాఖ్యానించారు. ఏ ముహం పెట్టుకొని ఏపీలో రాజకీయం చేస్తున్నావని, వైఎస్సార్ కూతురు అనే గుర్తింపు తప్ప మరే గుర్తింపు లేదని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తుంది సీఎం జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. చంద్రబాబు
కుట్రలో షర్మిల బలి అవుతుందని, బాబు ఒంటి నిండ రాజకీయమే అని రోజా అన్నారు.