కృష్ణా: రామవరప్పాడు జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో MLA వెంకట్రావు శనివారం పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులను స్వచ్ఛత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని సూచించారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు.