వైఎస్ రాజశేఖర్ బిడ్డ అంటూ చెప్పుకుంటున్న షర్మిలకు ఆయన వారసుడు సీఎం జగన్‌ను జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీ కదా అని రోజా అన్నారు. అలాంటిది ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరావు అని షర్మిలను ప్రశ్నించారు.
Roja: ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరావు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ను గతంలో జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీ అని నీకు తెలియదా అని ప్రశ్నించారు. అలాంటిది కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోరాటం చేస్తానని అక్కడ కొన్నాళ్లు హడావిడీ చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఏపీకి వచ్చారు. ఇక్క డ ఎవరికోసం ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు.
ఏ లబ్ధి ఆశించి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారో చెప్పాలని అన్నారు. వైఎస్సార్ బతికుంటే కాంగ్రెస్‌పై ఉమ్మేసేవారని గతంలో అన్న షర్మిల ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరానని ప్రశ్నించారు. ఏపీకి మంచి చేయాలని ఉంటే షర్మిలకు ఒక సలహా ఇస్తున్నానని, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6 వేల కోట్లను తీసుకురావాలని రోజా పేర్కొన్నారు.