CM Jagan: ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారుగా 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై జగన్ చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు విషయంలో కూడా ప్రధానితో చర్చించారు. అలాగే కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని జగన్ కోరారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు కూడా చేయాలని జగన్ ప్రధానిని కోరారు.