»Ycp Leaders Protest Not To Give Ticket To Ap Minister Roja Request To Ys Jagan
Roja: రోజాకు టికెట్ ఇవ్వొద్దని ఐదు మండలాల నేతలు నిరసన
సొంత నియోజకవర్గంలో అది సొంత పార్టీ నేతలే రోజాకు టికెట్ ఇవ్వొద్దని నిరసన చేశారు. జగనన్న ముద్దు - రోజా వద్దు అంటూ ప్రకార్డులతో ఐదు మండలాల వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీద బైటాయించారు.
YCP leaders protest not to give ticket to AP Minister Roja.. Request to YS Jagan
Roja: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు నగరా మోగనుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడీవేడీ రాజేసుకుంది. వైసీపీ పై, ఒక వైపు కూటమి, మరో వైపు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. అదే స్థాయిలో వైసీపీ కూడా విమర్శలను తిప్పి కొడుతూ ప్రత్యర్థులపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రోజాపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు. ఆమెకు టికెట్ ఇవ్వద్దని నిరసన చేపట్టారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ను కోరారు. జగనన్న ముద్దు – రోజా వద్దు అని ప్లకార్డులతో రోడ్డు మీద బైటాయించారు. రోజాకు సొంతంగా గెలిచే పరిస్థితి లేదని, తమ సపోర్ట్ ఉండడం వల్లే రెండు సార్లు గెలిచిందని అన్నారు.
నగరి నియోజకవర్గంలో కార్యకర్తలందరూ నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. వారి మాట కాదని రోజాకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని అన్నారు. కార్యకర్తలను రోజా లెక్క చేయదని, చాలా చులకనగా మాట్లాడుతుందని అన్నారు. నియోజవర్గాన్ని రోజా, తన సోదరులు దోచేశారని ఆరోపించారు. తమ అనుచరులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వలన పార్టీకి నష్టం జరుగుతుందని, ముఖ్యమంత్రి జగన్ ఇది గమనించుకోవాలని అన్నారు.