MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే... ఆమెకు బదులు ఆమె లాయర్ సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లడం గమనార్హం. ఫోన్ల లాక్ కు సంబంధించి ఆమెను రమ్మని పిలిచారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే… ఆమెకు బదులు ఆమె లాయర్ సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లడం గమనార్హం. ఫోన్ల లాక్ కు సంబంధించి ఆమెను రమ్మని పిలిచారు. అయితే.. సోమా భరత్ ఆమె తరఫున ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్ల పరిశీలనకు ఆథరైజ్డ్ పర్సన్ ను పంపించమని తెలిపింది ఈడీ. కవిత హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో భరత్ ఈడీ ముందుకు వెళ్లారు. ఆయనకు గతంలోనే ఫోన్ల ఆథరైజేషన్ ఇచ్చారు కవిత.
ఈ కేసులో కవితను ఈడీ ఈనెల 11న తొలిసారి విచారించింది. ఆ తర్వాత 16న మరోసారి హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. చట్టప్రకారం మహిళలను వారి ఇంటి దగ్గరే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి తనను పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆమె 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న ధర్మాసనాన్ని కోరారు.